మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం తిరుమల మహేష్– 27 మంది ఆడబిడ్డల వివాహ వేడుకలకు పుస్తె-మెట్టెల కానుకలు,
పొలిటికల్ పవర్ తెలుగు దిన పత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్వనపర్తి జిల్లా బ్యూరో 02 మే 2026. సామాజిక సేవను బాధ్యతగా భావిస్తూ నిరుపేదల ముఖాల్లో చిరునవ్వు చూడటమే లక్ష్యంగా సాగుతున్న టి.ఎస్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ తిరుమల మహేష్ తన ఉదారతను మరోసారి చాటుకున్నారు. కులమతాలకు అతీతంగా, పేదరికాన్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకుని ఆపదలో ఉన్న ప్రతి ఇంటికి అండగా నిలవడమే ధ్యేయంగా పెట్టుకున్న ఆయన ఇప్పటివరకు అన్ని వర్గాలకు చెందిన సుమారు 27 మంది ఆడబిడ్డల వివాహ వేడుకలకు మంగళప్రదమైన ‘పుస్తె’ (బంగారు తాళిబొట్టు) ‘వెండి మెట్టెలను’ కానుకగా అందజేసి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. నాగవరం గ్రామానికి చెందిన పసుపుల ఆనంద్ – సుజాత దంపతుల కుమార్తె, నాయి బ్రాహ్మణ ఆడబిడ్డ అపూర్వ వివాహ మహోత్సవానికి ఈ మంగళప్రదమైన కానుకను అందజేసి ఆ కుటుంబానికి కొండంత భరోసానిచ్చారు. ఏ కష్టం వచ్చినానేనున్నానంటూ ధైర్యాన్నిచ్చే మహేష్ సేవా దృక్పథం ఎందరికో ఆదర్శంమని గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వనపర్తి పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు అశ్విని చంద్రకుమార్ మాట్లాడుతూ తిరుమల మహేష్ కులమతాలకు తావు లేకుండా నిరుపేద కుటుంబాలకు ఒక ఆశీర్వాదం వంటి వారు. ఇప్పటికే 27 మంది ఆడబిడ్డల పెళ్లిళ్లకు పుస్తె, మెట్టెలు అందజేసి ఆ కుటుంబాల్లో సంతోషాన్ని నింపిన మహేష్ మహోన్నత వ్యక్తిత్వానికి హృదయపూర్వక అభినందనలు అని పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమంలో వనపర్తి పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు అశ్విని చంద్రకుమార్, జిల్లా అధ్యక్షులు అశ్విని రమేష్, జిల్లా గౌరవ అధ్యక్షులు మాందాపూర్ కృష్ణయ్య , జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకుంట నాగరాజు తదితరులు పాల్గొన్నారు.