నాగేంద్ర పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 02 మే 2026:- వనపర్తి పట్టణం పదో వార్డ్కు చెందిన నాగేంద్ర అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి నాగేంద్ర పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. నాగేంద్ర కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని మనోధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, 11 వార్డ్ మాజీ కౌన్సిలర్ యాదగిరి, వనపర్తి పట్టణ ప్రధాన కార్యదర్శి బాబా, సీనియర్ నాయకులు ద్వారపోగు విజయ్ బాబు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.