POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 02 May 2026, 7:21 pm Posted by : POLITICAL POWER

పెద్దమందడి సింగిల్ విండో సీఈవో జగదీశ్వర్ రెడ్డికి ఘన వీడ్కోలు

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక & పిఎన్9 టివి తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 02 మే 2026: వనపర్తి జిల్లా పెద్దమందడి సింగిల్ విండో సీఈవో జగదీశ్వర్ రెడ్డి పదవి విరమణ కార్యక్రమం శనివారం పెద్దమందడి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ సింగిల్ విండో అధ్యక్షులు, డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, యూనియన్ నాయకులు, రైతులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరై జగదీశ్వర్ రెడ్డిని ఘనంగా సన్మానించి పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… జగదీశ్వర్ రెడ్డి తన ఉద్యోగ జీవితంలో నిజాయితీ, క్రమశిక్షణ, సేవా భావంతో పనిచేసి రైతులకు అందుబాటులో ఉంటూ సంస్థ అభివృద్ధికి విశేష కృషి చేశారని కొనియాడారు. రైతు సమస్యల పరిష్కారంలో ఆయన చూపిన చొరవ, సహనంతో వ్యవహరించిన తీరు అందరికీ ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. సింగిల్ విండో అభివృద్ధి, రైతులకు అవసరమైన సేవలు అందించడంలో జగదీశ్వర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని, సహచర ఉద్యోగులతో స్నేహపూర్వకంగా వ్యవహరించి మంచి గుర్తింపు పొందారని నాయకులు తెలిపారు. ఉద్యోగ విరమణ అనంతరం కూడా సమాజ సేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. తనకు సహకరించిన ప్రజాప్రతినిధులు, రైతులు, సహచర సిబ్బందికి జగదీశ్వర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగ జీవితంలో అందరి సహకారంతోనే బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలిగానని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో అధ్యక్షులు, డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, యూనియన్ నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.