ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి –పెద్దమందడి తహసిల్దార్ పాండు నాయక్
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 04 మే 2026: పెద్దమందడి మండలంలో రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసిల్దార్ పాండు నాయక్ సూచించారు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు దాదాపు 40 డిగ్రీల వరకు నమోదవుతున్నాయని ఆయన తెలిపారు. ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా రైతులు మరియు పని పథకం కూలీలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మధ్యాహ్న వేళల్లో అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా ఉండాలని సూచించారు. తాగునీటిని తరచుగా తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్‌ను నివారించవచ్చని చెప్పారు. తలపై గుడ్డ లేదా టోపీ ధరించడం ద్వారా ఎండ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు. వృద్ధులు, చిన్నపిల్లలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఎండల తీవ్రతను తట్టుకోలేని పరిస్థితుల్లో వెంటనే వైద్యులను సంప్రదించాలని అన్నారు. గ్రామాల్లో ప్రజలు పరస్పరం సహకరించుకొని జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఎండల కాలంలో అప్రమత్తతతో వ్యవహరిస్తే ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని తహసిల్దార్ పాండు నాయక్ తెలిపారు.