POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 04 May 2026, 8:01 pm Posted by : POLITICAL POWER

మినుముకుంట కట్ట ధ్వంసం ఘటనపై చర్యలు తీసుకోవాలి బీఆర్ఎస్ నాయకుల డిమాండ్

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 04 మే 2026: వనపర్తి మండలం కాశీంనగర్ గ్రామానికి చెందిన మినుముకుంట కట్టను ధ్వంసం చేసిన ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి ధ్వంసమైన ప్రదేశాన్ని సందర్శించి, బాధిత రైతులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు ఇరిగేషన్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, కట్టను పునర్నిర్మించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నాయకుడు తన పొలంలో ఉందని చెప్పి ఈ కట్టను ధ్వంసం చేసినట్లు వారు ఆరోపించారు. కట్టను పునరుద్ధరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. రైతు రాము మాట్లాడుతూ ఈ కుంటకు గత 20 సంవత్సరాలుగా పథకాల కింద అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు. కట్టకు తూము, అలుగు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కట్ట తొలగింపుతో పొలాలకు వెళ్లే మార్గం దెబ్బతినడంతో పాటు భూగర్భ జలాలపై ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే అధికారులను కూడా బెదిరిస్తున్నారని ఆరోపించారు. మరో రైతు మాట్లాడుతూ… ఈ కట్టపై నుంచి తరతరాలుగా రైతులు తమ పొలాలకు వెళ్లేవారని, కట్ట తొలగింపుతో వందల ఎకరాల రైతులకు నష్టం జరుగుతుందని తెలిపారు. కట్ట మట్టితో సమీపంలోని బావిని పూడ్చడంతో గ్రామ దేవతకు వెళ్లే మార్గం కూడా మూసుకుపోయిందని అన్నారు. వర్షాకాలంలో వరదల వల్ల పంటలు నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి మండల పార్టీ అధ్యక్షుడు కే మాణిక్యం, నాయకులు రఘువర్ధన్ రెడ్డి, డేగ మహేశ్వర్ రెడ్డి, చిట్యాల రాము, ఉల్లెందుల రాములు, ఎర్రన్న, తిరుపతయ్య, గుండెమోని మధు, బాలరాజు, హనుమంతు, ఆనంద్, నక్కమోని చిన్న రాము, మహేష్, నరేష్, రేవల్లి వెంకటయ్య, బుడ్డమ్మ, శివకుమార్, కురుమూర్తి, పెద్దగూడెం రాములు తదితరులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.