ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై హైకోర్టు కఠిన వైఖరి – విద్యార్థుల ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు జమ చేస్తారో వివరాలు ఇవ్వాలంటూ ఆదేశం పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక తెలంగాణ స్టేట్ డెస్క్: ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో తెలంగాణ హైకోర్టు మరోసారి ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేసుకోవచ్చని కాలేజీ యాజమాన్యాలకు గతంలో ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా జీవో 7 అమలులో ఉందని పేర్కొంటూ, ఇటీవల ఆ జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో, జీవో 7పై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని...