POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 06 May 2026, 10:52 am Posted by : POLITICAL POWER

 

 

 

 

 

మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు

మృతి చెందిన నలుగురు రైతుల కుటుంబాలకు

ఒక్కొక్కరికి ₹2 లక్షల

పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి సతీష్ : మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలంలో చోటుచేసుకున్న ఘోర ప్రమాద ఘటనలపై ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు గారు తక్షణమే స్పందించడం బాధితులకు కొంత ఊరటనిచ్చే అంశం.ఈ విషాదానికి సంబంధించిన ముఖ్యాంశాలు
తక్షణ ఆర్థిక సాయం: మృతి చెందిన నలుగురు రైతుల కుటుంబాలకు తన వ్యక్తిగత తరపున ఒక్కొక్కరికి ₹2 లక్షల చొప్పున తక్షణ ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే ప్రకటించారు.ప్రభుత్వం నుండి 5లక్షల రూపాయలు సహాయం అందిస్తాం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు.ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు ప్రభుత్వం తరపున మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.రైతు కుటుంబాల్లో నెలకొన్న ఈ విషాదం పట్ల స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యే స్పందన పట్ల బాధితులు, స్థానికులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.