Date of Publish : 06 May 2026, 2:07 pmPosted by : POLITICAL POWER
దాసరాజు నాగమ్మ ను పరామర్శించిన మాజీ మంత్రి
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 06 మే 2026: వనపర్తి పట్టణానికి చెందిన దివంగత దాసరాజు నాగేష్ సతీమణి దాసరాజు.నాగమ్మ కు ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కిమ్స్ హాస్పిటల్ కు వెళ్లి నాగమ్మను పరామర్శించి దైర్యం చెప్పారు. హృద్రోగ నిపుణులు డాక్టర్ విజయ్ కుమార్ ను అడిగి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. నాగమ్మ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నాగమ్మ కుమారుడు దసరాజు రాజేష్ ఉన్నారు.