POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 06 May 2026, 6:05 pm Posted by : POLITICAL POWER

తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 06 మే 2026: వనపర్తి జిల్లా సాహితీ కళా వేదిక అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం మాట్లాడుతూ… కవులు, కళాకారులు, సాహిత్యవేతలు తమ సృజనాత్మకతతో సమాజాన్ని జాగృతిపరచాలని కోరారు. మంచి సమాజ నిర్మాణానికి కవిత్వం, పాటలు, రచనలు మార్గదర్శకంగా ఉండాలని ఆయన సూచించారు. కళా, సాహిత్య రంగాల్లో ఉన్నవారందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.