POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 07 May 2026, 12:21 am Posted by : POLITICAL POWER

ప్రతి ఒకరు మీ ఖాతా అకౌంట్ రి కేవైసి తప్పనిసరిగా చేయించుకోండి చీఫ్ మేనేజర్ రీజనల్ ఆఫీసర్ చేన్న శ్రీనివాస్ నాగర్ కర్నూల్ 

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 06 మే 2026: పెద్దమందడిలో ప్రతి ఒక్కరు వారి యొక్క ఖాతాలను సరి చూసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం 10 సంవత్సరాలకు ఒకసారి, ఐరిక్స్ కస్టమర్ అయితే 2సంవత్సరాలకు ఒకసారి ఆధార్ కార్డు తీసుకోవాలి. ఈ ఆధార్ కార్డు ఎందుకు తీసుకోవాలంటే సైబర్ నేరాలు జరుగుతున్నాయి కాబట్టి ఇతర రాష్ట్రాల నుండి ఓటిపి గిఫ్ట్ అని చెప్పినప్పుడు మన ఫోన్లో ఉండే వైరస్ మొత్తం వారికి వెళుతుంది. రకరకాల సైబర్ నేరాలు జరుగుతాయి. మారిన ఆధార్ కార్డులను బ్యాంకులో చూయించాలి నకిలీ అకౌంట్లను తీసివేయవచ్చు బ్యాంకు అకౌంట్ కు ఆధార్ కార్డు అప్డేట్ సరిగా ఉంటేనే కేంద్ర ప్రభుత్వ రుణలు అందుతాయి అని చీప్ రీజనల్ ఆఫీసర్ చెన్న శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ జ్ఞానేశ్వర్, ఫీల్డ్ ఆఫీసర్ కుల్దీప్, ఏపిఎం సక్రు నాయక్, సర్పంచులు గంగమ్మ రవి, స్వరూప, మణిగిల్ల కొండా రవీందర్ రెడ్డి, బ్యాంకు మిత్ర సభ్యులు, బ్యాంక్ సిబ్బంది ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు.