POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 07 May 2026, 11:29 am Posted by : POLITICAL POWER

– శృంగారంలో అపశృతి..

– విలేకరి నాలుక కొరికిన మహిళ.

– పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి సతీష్

కడప ఒంటిమిట్ట హరిత హోటల్‌లో షాకింగ్ ఘటన!

కర్బూజ వ్యాపారం చేసే ఓ పత్రికా విలేకరి రవిబాబు, ఆటో డ్రైవర్ హరికి ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఆదివారం సాయంత్రం వీరు ముగ్గురు కలిసి ఒంటిమిట్టలోని హరిత హోటల్‌కు వెళ్లారు. తొలుత సిబ్బంది అడ్డుకున్నా, విలేకరి తన పరపతిని ఉపయోగించి లోపలికి వెళ్లారు..!

 

గదిలోకి వెళ్ళిన తర్వాత ముగ్గురూ కలిసి మద్యం సేవించారు. ఆపై జరిగిన శృంగార కార్యక్రమం నేపథ్యంలో సదరు మహిళ విలేకరి రవిబాబు నాలుకను బలంగా కొరికివేసింది. ఆ ప్రదేశమంతా రక్తమయమైంది..!

 

తీవ్ర రక్తస్రావం కావడంతో భయపడ్డ రవిబాబు వెంటనే స్థానిక PHCకి వెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు అతడిని 108లో కడప రిమ్స్‌ (RIMS)కు తరలించారు. ఈ లోపు ఆటో డ్రైవర్ సదరు మహిళను రైల్వే స్టేషన్ దగ్గర వదిలేశాడు..!

ప్రస్తుతం ఆ మహిళ కనిపించకుండా పోయింది. ఆమె అఘాయిత్యం నుంచి తప్పించుకోవడానికి కొరికిందా లేక మరేదైనా కారణమా అనేది తెలియాల్సి ఉంది. పోలీసులు ఆటో డ్రైవర్‌ను విచారిస్తున్నారు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న హరిత హోటల్ మేనేజర్‌కు ఉన్నతాధికారులు మెమో జారీ చేశారు..!