BREAKING
ఆధార్ కార్డుపై కేంద్రం కీలక
అప్‌డేట్..
ఉచిత బస్ పథకంలో సస్పెన్స్!
పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి సతీష్
ఆధార్ కార్డు వినియోగదారులకు UIDAI క్లారిటీ ఇచ్చింది. ఆధార్ లెటర్, ఈ-ఆధార్, PVC కార్డు, ఎం-ఆధార్ యాప్.. ఏ రూపంలో ఉన్నా అవన్నీ సమానంగానే చెల్లుబాటు అవుతాయని తెలిపింది. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు సహా అన్ని సంస్థలు వీటిని గుర్తింపు పత్రాలుగా అంగీకరించాలని స్పష్టం చేసింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు అమలవుతున్న ఉచిత బస్ పథకాలలో మాత్రం ఫిజికల్ ఆధార్ కార్డు తప్పనిసరిగా అడుగుతున్నారని మహిళలు చెబుతున్నారు.
ఫోన్‌లో mAadhaar చూపించినా అనుమతించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఈ అంశంపై ప్రభుత్వాలు స్పందించాల్సి ఉంది.