*రూ.3.5 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అటవీ శాఖ అధికారులు* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మే 07: భద్రాచలం అటవీ శాఖలో అవినీతి వ్యవహారం బట్టబయలైంది. లంచం తీసుకుంటుండగా భద్రాచలం ఎఫ్‌డీవో సుజాత, చర్ల ఇన్‌చార్జ్ డీఆర్‌వో కృష్ణయ్యలను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి జిల్లా చర్ల మండలం పూసుగుప్ప ప్రాంతంలో రహదారి నిర్మాణ పనులు చేపట్టారు. ఈ పనుల సమయంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న కొన్ని చెట్లను తొలగించినట్లు అధికారులు...