
వర్షానికి చెట్టు విరిగి ఇంటిపై పడి మూడు రోజులైనా
పట్టించుకునే నాధుడే లేడు
గ్రామపంచాయతీ సిబ్బంది కారోబరి ఆవేదన.
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక PN9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో కే సతీష్ కుమార్.
మంచిర్యాల జిల్లా లక్షట్ పేట్ మండలం కొత్తూరు గ్రామపంచాయతీ పరిధిలో మొన్న బుధవారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షం ఈదురు గాలులకు రావడంతో కొత్తూరు గ్రామ పంచాయతీలో కారోబారిగా పని స్తున్న శాతరాసి రాజయ్య, ఇంటిపై చెట్టు విరిగి పడిపోయింది. ఇప్పటికీ మూడు రోజులైనా గ్రామ సర్పంచ్ కానీ కార్యదర్శి కానీ అధికారులు ఎవరు కూడా పట్టించుకోవడంలేదని గ్రామపంచాయతీలో పనిచేస్తున్న నాకే న్యాయం చేయట్లేదు గ్రామ ప్రజలకు ఏం న్యాయం చేస్తారని గ్రామ ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు గ్రామ సర్పంచ్ మాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.