Date of Publish : 08 May 2026, 2:55 pmPosted by : POLITICAL POWER
నందిమల్ల హారిక జన్మదినం సందర్భంగా చేయూత ఆశ్రములో అన్న ప్రసాద వితరణ
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 08 మే 2026: మాజీ కౌన్సిలర్ నందిమల్ల శారద అశోక్ దంపతుల కుమార్తె నందిమల్ల హారిక పుట్టిన రోజు సందర్భంగా చేయూత అనాధ ఆశ్రమములో విద్యార్థులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ… గతములో మా ఇంట్లో వేడుకలను వృద్ధాశ్రమంలో మరియు చేయూత ఆశ్రమములో సేవ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. శుభ కార్యాలు, వేడుకలు వృద్ధాశ్రమం, అనాధ పిల్లల సమక్షంలో జరుపుకోవడం ఆత్మసంతృప్తి కలుగుతుంది అని ఇతరులకు స్పూర్తిదాయకంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమములో నందిమల్ల అశోక్, ఆశ్రమ నిర్వాహకులు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.