POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 08 May 2026, 4:21 pm Posted by : POLITICAL POWER

మానవతా సేవా నిరతి గల్ల స్వచ్ఛంద సంస్థ రెడ్‌క్రాస్ దాతలకు ఘనంగా సన్మానం పలుస శంకర్ గౌడ్

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 08 మే 2026: ప్రపంచం రెడ్‌క్రాస్ దినోత్సవం సందర్భంగా వనపర్తి రెడ్‌క్రాస్ కార్యాలయంలో ఘనంగా నిర్వాహినిచారు. ఈ సందర్బంగా సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ మాట్లాడారు. రెడ్‌క్రాస్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత గుర్తింపు పొందిన, స్వచ్ఛంద మానవతావాద సంస్థ అన్నారు. యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు, అంటువ్యాధులు మరియు ఇతర అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాపాయంలో ఉన్నవారిని రక్షించడం, వారికి సహాయం చేయడం ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం ఈ సంస్థను 1863లో హెన్రీ డునాంట్ స్థాపించారు. 1901లో హెన్రీ డునాంట్ నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. ప్రతి సంవత్సరం మే8న ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవాన్ని జరుపుకుంటాము అన్నారు. రెడ్‌క్రాస్ ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద రక్త నిల్వ కేంద్రాలను రెడ్‌క్రాస్ నిర్వహిస్తోంది. వరదలు, భూకంపాలు, తుఫానులు సంభవించినప్పుడు బాధితులకు ఆహారం, ఆశ్రయం, వైద్య సహాయం అందిస్తుంది. అత్యవసర వైద్య శిబిరాలు, ప్రథమ చికిత్స శిక్షణ, మరియు అంబులెన్స్ సేవలను నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాల సమయంలో మరియు రక్తదాన శిబిరాలు “మానవత్వమే మహోన్నత సేవ” నినాదం రెడ్‌క్రాస్ పని చేస్తుంది. కుల, మత, వర్ణ, వర్గ భేదాలు లేకుండా సేవలు అందించే ఈ సంస్థ, సమాజంలో శాంతి మరియు సోదరభావాన్ని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తోంది. రెడ్‌క్రాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో గంధం నాగరాజు డా. బండారు శ్రీనివాస్ మురళి వసీం అక్రమ్ గోవిందు, లక్ష్మి స్టాఫ్ నర్స్, సంతోష్ కుమార్ మరియు తిరుపతయ్య పాల్గొన్నారు.