POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 08 May 2026, 4:31 pm Posted by : POLITICAL POWER

పెద్దమందడిలో పశు వైద్య శిబిరం విజయవంతం

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 08 మే 2026: పెద్దమందడి పశువైద్యశాలలో “ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పశు ఆరోగ్య శిబిరం విజయవంతంగా ముగిసిందని పశువైద్య అధికారి డాక్టర్ శ్యామ్ తెలిపారు. గ్రామ సర్పంచ్ గంగమ్మ రవి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పశువులకు గర్భకోశ సంబంధిత వ్యాధులకు చికిత్సలు అందించడంతో పాటు దూడలకు నట్టల నివారణ మందులు తాగించారు. అలాగే పాడి రైతులకు పశుగ్రాస విత్తనాలు పంపిణీ చేసి, వేసవి కాలంలో పశువుల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, పాడి రైతులు, పశువైద్య సిబ్బంది జగదీష్, వెంకటేష్, రాజేష్, గోపాలమిత్రలు రాఘవేందర్, నరసింహ, రవి తదితరులు పాల్గొన్నారు.