POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 08 May 2026, 5:52 pm Posted by : POLITICAL POWER

ఖమ్మం నగరంలో పదవి కాలం ముగిసిన కార్పొరేటర్లకు ఘన సత్కారం ప్రొఫెసర్ జయశంకర్ పార్క్ వాకర్స్ అసోసియేషన్

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి. ఈరోజు ఉదయం ఖమ్మం నగరంలోని ప్రకాష్ నగర్ ప్రొఫెసర్ జయశంకర్ పార్కు నందు స్థానిక పార్కు అనుసందంగా ఉన్న రెండు డివిజన్ల కార్పొరేటర్ల పదవీకాలం ముగిసిన సందర్భంలో వారికి పదవి ఉన్నప్పుడు పార్కు అభివృద్ధికి సహాయ సహకారాలు అందించినందుకు

28వ డివిజన్ కార్పొరేటర్ గజ్జల లక్ష్మి వెంకన్న

కొప్పెర సరిత ఉపేందర్ లకు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పులకల వెంకన్న సారధ్యంలో.

ఘనంగా సత్కార కార్యక్రమం నిర్వహించడం జరిగింది . పలువురు వాకర్స్ పాల్గొని వారు చేసిన అభివృద్ధిని కొనియాడుతూ రాబోయే రోజుల్లో కూడా ఎవరు ఎవరు ఏ పదవిలో ఉన్న అందరికీ ఉపయోగకరమైన ఈ పార్కు అభివృద్ధికి అందించాలి అని అలాగే రానున్న రోజుల్లో ఈ పార్కు నందు తాగునీటి సమస్య లేకుండా ఆర్వో వాటర్ ప్లాంట్ , గ్రంథాలయం , మరుగుదొడ్లు పరుశుభ్రత లాంటివి నిరంతరం ఏర్పాటు చేయాలి అని పలువురు వాకర్సు అభిప్రాయాలు తెలియపరిచారు.

సన్మాన గ్రహీత కొప్పెర సరిత – ఉపేందర్ మాట్లాడుతూ. నాకు వచ్చిన నిధులలో నుండి కొంతమేరకు డివిజన్ నుండి అభివృద్ధి పనులు చూసుకుంటూ పార్కు యొక్క అభివృద్ధికి శాయశక్తుల చేశాను అని రానున్న రోజుల్లో తప్పనిసరి ఇంకా మెరుగైన సేవలకు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్యులు కలెక్టరు మున్సిపల్ కమిషనర్ వంటి అధికారుల వద్దకు కూడా నేను సైతం వెళుతూ మీ వాకర్స్ అసోసియేషన్ సభ్యులను తీసుకెళ్లి ఇంకా కావలసిన అభివృద్ధికి సహకరిస్తాను అని తెలియపరిచారు.

మరో సన్మాన గ్రహీత గజ్జల లక్ష్మి – వెంకన్న మాట్లాడుతూ.

ఈ ఐదు సంవత్సరాలలో ప్రజల ప్రేమ అనురాగాలు నిరంతరం పొందుతూ ఎవరికి ఎటువంటి సహాయం కావలసి వచ్చిన సందర్భంలో మేము సైతం ఆ స్థలంలో ఉండి వారికి అన్ని రకాల సహాయ సహకార అందించామని అలాగే ఇప్పుడున్న ఈ పార్కు నందు స్థానిక మంత్రివర్యులతో అనేక సందర్భాలు మాట్లాడి నిధులు కొంతమేరకు సపరేట్గా తీపించి పార్క్ డెవలప్మెంట్ కింద వాకర్స్ కి ఫుట్ ఫాత్ నిర్మించడంలో పార్క్ మధ్యలో యోగా షెడ్డు స్కేటింగ్ లాంటి నిర్మాణ పనులకు చిన్న చిన్న మౌలిక సదుపాయాలు ఈ కార్యక్రమంలో మా యొక్క పదవిని ఉపయోగించి మున్సిపల్ కమిషనర్ ఉన్నత అధికారులతో మాట్లాడి అభివృద్ధి చేపిచ్చే కార్యక్రమం చేసాము అని తెలియపరుస్తూ రానున్న రోజుల్లో పదవి ముఖ్యం కాకుండా వ్యక్తిగతంగా అయినా ఇంకా వాకర్స్ కి ఎటువంటి మౌలిక వసతులు కావాలి అన్న తప్పనిసరి మావంతుగా మేము సాయసాకార అందిస్తాము అని లక్ష్మీ – వెంకన్న తెలియపరిచారు.

ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు

పులకల వెంకన్న

ప్రొఫెసర్ జయశంకర్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి

మాతంగి అనిల్ కుమార్

వాకర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు

గౌస్ పాషా ,

I న్యూస్ నాగేశ్వరరావు

వాకర్స్ అసోసియేషన్ కోశాధికారి వెంపటి రవికుమార్ వాకర్స్ అసోసియేషన్ ఆర్గనైజర్ కార్యదర్శిలు కొల్లి విద్యాసాగర్ ,వల్లూరు వెంకట్  వాకర్స్ అసోసియేషన్ సహాయ కార్యదర్శులు సారంగుల రమణ,కానిస్టేబుల్ వెంకట్, కమిటీ సభ్యులు డాక్టర్ భాస్కర్, రాజు, జమీల్, రామ్మూర్తి, సోమయ్య, బొడ్డు వెంకటరత్నం, చాంద్ పాషా, మహిళా వాకర్స్ కరుణ , లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.