*సమగ్ర కుల గణన ఏది?*
*కేంద్ర క్యాబినెట్ ను ప్రశ్నిస్తున్నాం*
*తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నరాల సత్యనారాయణ*
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్
జాతీయ జన గణనలో సమగ్ర కుల గణన చేపడతామని కేంద్ర క్యాబినెట్ గత ఏడాది తీసుకున్న నిర్ణయం ఏమైనదని టిఆర్ఎస్ ( డి) ప్రశ్నిస్తుంది. దేశవ్యాప్తంగా చేపడుతున్న తొలి దశ కుటుంబాల లెక్కింపులో ఓబీసీ కుటుంబాలను ఎందుకు లెక్కించట్లేదని ప్రశ్నిస్తున్నాం.
ఈ సందర్భంగా టిఆర్ఎస్( డి) రాష్ట్ర అధ్యక్షులు నరాల సత్యనారాయణ మాట్లాడుతూ మహిళా బిల్లులో ఓబీసీ మహిళలకు సబ్ కోటా ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర అసెంబ్లీలో బీసీల విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్ల ను 42 శాతం పెంచుతూ ఏకగ్రీవ ఆమోదముతో చేసిన చట్టాన్ని గత ఏడాదిగా ఆమోదించకుండా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా బిసి, ఎస్సి, ఎస్టి రిజర్వేషన్లపై విధించిన 50 శాతం పరిమితిని ఎందుకు ఎత్తివేయట్లేదని అదేవిధంగా పదకొండు ఏళ్ల పరిపాలనలో 80 కోట్ల మంది బీసీల సంక్షేమానికి వీలుగా ప్రత్యేక ఓబీసీ మంత్రిత్వ శాఖ ఎందుకు ఏర్పాటు చేయడం లేదని టిఆర్ఎస్ ( డి) రాష్ట్ర అధ్యక్షులు,నరాల సత్యనారాయణ నిలదీశారు. దేశంలోని ఓబీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఎందుకు పెంచట్లేదని ప్రశ్నించారు