POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 09 May 2026, 10:58 am Posted by : POLITICAL POWER

డిప్యూటీ కమీషనర్ శైలజ ను ఘనంగా సన్మానించిన సామాజిక కార్యకర్త : డా. లక్ష్మివీరమల్లు

బోడుప్పల్: 08 మే (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళ

 

ఎన్నో ఏళ్ల సుదదీర్ఘ మైన ప్రయాస బోడుప్పల్ లోని రా చెరువు పరిరక్షణ సమితి సభ్యులది, ప్రజలది, అనేక సమస్యలతో విషతుల్యం అయిన చెరువు కోసం వివిధ నాయకులు స్వచ్చంద సంస్థలు అనేక సమూహాలు మంత్రుల,ఏమ్మెల్యే,ఎమ్మెల్సీ, ఎంపీ,జడ్పీటీసీ, ఎంపీపీ. మున్సిపల్ పాలక మండలి సభ్యులు,కమీషనర్,కలెక్టర్, ఇరిగేషన్,పొల్యూషన్ బోర్డు ,మాజీ మేయర్, ముఖ్యంగా తోటకూర వజ్రేష్ యాదవ్ ది ప్రత్యేక కృషి అప్పటి కమీషనర్ ఇప్పటి డిప్యుటీ కమీషనర్ శైలజా ముందు చూపు ఆలోచన విధానం మాజీ మేయర్ అజయ్ కుమార్ పట్టుదలతో నేడు రా చెరువు అత్యంత సుందరంగా మినీ ట్యాంక్ బండ్ గా రూపు దిద్దుకొనే సందర్బంగా నేడు డిప్యుటీ కమీషనర్ మిగిలి పోయిన నాలా పనులు వాసవి నగర్ చౌరస్తా నుండి గాయత్రి హిల్స్ రోడ్డు మారమ్మత్తులు చూసి తక్షణమే అధికారుల కు ఫోన్ చేసి రిపేర్ త్వరగా చేయాలి అని ఆదేశాలు జారీ చేశారు. జిహెచ్ఎంసి అధికారులు కూడా పాల్గొని దోమల నివారణకు తక్షణ చర్యల గూర్చి వివరించారు. మల్లయ్య నగర్ లోని కమ్యూనిటీ హల్ గూర్చి కూడా అధికారులను వివరాలు అడిగి తక్షణమే మిగిలిన పనులు పూర్తి చేసే విదంగా చర్యలు తీసుకో వాలని చెప్పారు. మల్లయ్య నగర్ ఇండ్ల యాజమాన్యం అందరూ సమిష్టిగా స్వంత నిధులతో నిర్మించిన ఓపెన్ జిమ్ సందర్శించి ఆనందం వ్యక్తం చేసారు మల్లయ్య నగర్ కమిటీని అభినందిo చారు.

అక్కడి నుండి రా చెరువు పరిరక్షణ సమితి సభ్యుల విజ్జప్తి మేరకు రా చెరువు కూడా సందర్శించి అక్కడ జరిగే పనుల వివరాలు తెలుకున్నారు.సభ్యులు చెరువు చుట్టూ కూడా వాకింక్ ట్రాక్ ఏర్పాటు చేస్తే అందరికి ఉపయోగం ఉంటుంది అని ఆరోగ్యం కోసం వాకింగ్ చాలా అవసరం ఉంది అని వివరించారు అలాగే కట్ట కింద రోడ్డు లేక నాచారం కంపెనీ లలో పనులు చేసే మహిళ లు చుట్టూ తిరిగి ఆర్థికంగా నష్ట పోతున్నారు. వెంటనే అధికారులు కాంట్రాక్టర్ కి సమాచారం ఇచ్చి మట్టి రోడ్డు సత్వరం పనులు అప్పగించారు.ఈ సందర్బంగా రా చెరువు పరిరక్షణ సమితి సభ్యులు వివిధ కాలనీ ల అధ్యక్షులు ప్రజలు డిప్యుటీ కమీషనర్ కి కృతజ్ఞత తెలుపుతూ ఘనంగా సన్మా నించుకున్నారు. ఈ సందర్బంగా రా చెరువు పరిరక్షణ సమితి సభ్యులు సామాజిక కార్యకర్త డా లక్ష్మి వీర మల్లు మాట్లాడుతు రా చెరువు పరిసర ప్రాంతం పై మీరు ప్రత్యేక ద్రుష్టి పెట్టి మాకు చాలా న్యాయం చేశారు అని కృతజ్ఞతలు తెలిపారు.మిగతా పనులు త్వరగా చేసే విదంగా కృషి చేయాలనీ కోరారు.

 

ఈ సందర్బంగా చంద్ర శేఖర్, నాగభూశనం,సంతోష్, రూపేష్, మోహన్, కోటేశ్వర్,సత్యనారాయణ కిరణ్,రవీందర్ రెడ్డి, నాగరాజు,రామ్ కుమార్, శరత్ మొదలైన అనేక మంది కాలనీ కుటుంబ సభ్యులు మున్సిపల్ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు.