POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 09 May 2026, 4:17 pm Posted by : POLITICAL POWER

 

 

రామగుండం అక్బర్ నగర్ హెచ్ ఆర్ సి ఐ హ్యుమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా కార్యాలయం లో ఈ రోజు నన్ను ఘనo గ సన్మానించడం జరిగింది.నన్ను ప్రేమతో, గౌరవంతో అభిమానం తో సన్మానించిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.


హెచ్ఆర్సీఐ కుటుంబంలో నాకు లభించిన ఈ గౌరవం మరింత బాధ్యతతో పనిచేయాలని ప్రేరణ ఇస్తోంది.

నాపై నమ్మకం ఉంచి, నాకు ప్రోత్సాహం అందించిన నేషనల్ కమిటీ స్టేట్ కమిటీ పెద్దలు, నాయకులు, సహచర సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

ఈ సన్మానం నా ఒక్కరిదే కాదు… నాతో కలిసి నడిచిన ప్రతి ఒక్కరి ప్రేమ, ఆశీర్వాదాల ఫలితం.

ఇకముందు కూడా మానవ హక్కుల పరిరక్షణ కోసం మరింత కృషి చేస్తూ, సంస్థ ప్రతిష్టను పెంచేందుకు అంకితభావంతో పనిచేస్తాను.

మరొక్కసారి నన్ను గౌరవించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ…

మీ అందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ నాపై ఉండాలని కోరుకుంటున్నాను. 🙏

ఈ కార్యక్రమం లో హ్యుమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా మీడియా ప్రోగ్రామ్స్ సెక్రెటరీ ప్రసాద్, పెద్దపెల్లి జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఆరిఫ్ పెద్దపెల్లి జిల్లా అడిషనల్ జనరల్ సెక్రెటరీ భోగి లింగమూర్తి, పెద్దపల్లి జిల్లా ఉమన్ పోర్టు వెల్ఫేర్ సెక్రెటరీ జె శాంత, పెద్దపల్లి జిల్లా ఉమన్ పోర్టు వైస్ ప్రెసిడెంట్ పూనా వాణి, కొండల అరుణ పెద్దపల్లి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ చందా చంద్రకాంత్, రామ్మూర్తి, దొగ్గల ప్రవీణ్ కుమార్, అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు