పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక /పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 15 2026: భారత దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, సామాజిక న్యాయం కోసం ఐక్యంగా పనిచేయాలని నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా అధ్యక్షులు విజయ్ యాదవ్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ నరసయ్య గౌడ్, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు చంద్రశేఖర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బండారి రమేష్ యాదవ్, ప్రచార కమిటీ అధ్యక్షులు నర్సింగ్ ముదిరాజ్, శేర్లింగంపల్లి నియోజకవర్గ నాయకులు కురుమూర్తి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.