ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలతో సొంత ఇంటి కల సహకారమైంది
ఎమ్మెల్యే మేఘారెడ్డి
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 09 మే 2026: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు సొంత ఇంటి కల సహకారం అవుతుందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. శనివారం పెద్దమందడి మండలం దొడగుంటపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే దంపతులకు నూతన వస్త్రాలను అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. 2. పెద్దమందడి మండలం చిన్నమందడి గ్రామానికి చెందిన కురుమయ్య గత ఎన్నో ఏళ్లుగా రేకుల ఇళ్లల్లో, మట్టి మిద్దెల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుపేదలకు 5 లక్షల విలువగల ఇందిరమ్మ పిల్లతో తమ సొంత ఇంటి కల నెరవేరిందని స్థానిక శాసనసభ్యులు తూడి మేఘారెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఎన్నో ఏళ్లుగా సొంత ఇంటిని నిర్మించుకోవాలని కల్లుదన్న నిరుపేద కుటుంబాలు ఆ కళా సహకారం కాకపోవడంతో సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నేడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం ద్వారా ప్రతి ఒక్క నిరుపేద సొంత ఇంటి కల నెరవేరిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, సర్పంచులు మాజీ సర్పంచ్ లు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.