*మే 15లోగా పెట్రోల్ ధరలు పెంచేస్తారా?* దేశంలో మే 15లోగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని జాతీయ మీడియా పేర్కొంది.క్రూడ్ ధర భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఆయిల్ కంపెనీలకు నెలకు ₹30వేలకోట్ల నష్టం వస్తున్నట్లు తెలిపింది. ఆ భారాన్ని తగ్గించుకునేందుకు ధరలు పెంచాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు పేర్కొంది. దీనికి ఆమోదం లభిస్తే పెట్రోల్, డీజిల్ ధరలు ₹4-5 వరకు పెరిగే అవకాశం ఉందని, డొమెస్టిక్ సిలిండర్ ధర ₹40-50 పెరగొచ్చని తెలిపింది.