POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 09 May 2026, 8:45 pm Posted by : POLITICAL POWER

అక్రమంగా ఎద్దులు, ఆవులను తరలిస్తున్న కంటైనర్‌,వ్యాన్ పట్టివేత—నలుగురిపై కేసులు నమోదు

 

ఈరోజు తెల్లవారుజామున సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావు ఆధ్వర్యంలో ఎస్‌ఐలు చంద్రకుమార్,అశోక్ రెడ్డిలు తమ సిబ్బందితో కలిసి దుబ్బపల్లి చెక్‌పోస్ట్ వద్ద వాహనతనిఖీలు నిర్వహిస్తుండగా,ఒక కంటైనర్‌లో 33 ఎద్దులను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి పట్టుకున్నారు. ప్రాథమిక విచారణలో ఆ ఎద్దులను కాగజ్‌నగర్ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు తేలింది.ఈ ఘటనకు సంబంధించి 33 ఎద్దులు,కంటైనర్‌ను స్వాధీనం చేసుకుని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలానికి చెందిన అబ్దుల్ ఖాన్, హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ అలీపై కేసు నమోదు చేశారు.

 

అదేవిధంగా ఉదయం 10:30 గంటల సమయంలో ఛత్తీస్‌గఢ్ నుంచి కర్ణాటకకు ఐచర్ వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న 9 ఆవులను కూడా స్వాధీనం చేసుకుని, కర్ణాటకకు చెందిన సయ్యద్ షాబాద్, సయ్యద్ మొయినుద్దీన్‌లపై కేసులు నమోదు చేశారు.స్వాధీనం చేసుకున్న ఆవులు, ఎద్దులను సమీప గోశాలలకు తరలించారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, ఎవరైనా పశువులను అక్రమంగా లేదా పరిమితికి మించి తరలిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.