POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 09 May 2026, 9:06 pm Posted by : POLITICAL POWER

ఉచిత క్యాన్సర్ శిబిరం ఏర్పాటు..

 

బసవతారకం రెండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సౌజన్యంతో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాకినేని యాక.నారాయణ వినోద్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో వసంతనగర్ డివిజన్ ధర్మారెడ్డి కాలనీలో శనివారం ఉచిత క్యాన్సర్ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కమ్మ కార్పొరేషన్ చైర్మన్. టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వైద్య పరీక్షల వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. నిర్వాహకులను అభినందించారు. డాక్టర్ పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన సలహాలు.సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తూము వేణు, అరవింద్ రెడ్డి, శ్రీనివాస్ బాబు, సాయి తులసి, వాసు, తదితరులు పాల్గొన్నారు.