POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 09 May 2026, 10:32 pm Posted by : POLITICAL POWER

ధాన్యం రవాణా టెండర్లలో భారీ స్కాం

కొనుగోలు సరే.. రవాణా చేయడానికి వాహనాలేవీ?

ట్రాన్స్ పోర్ట్ వాహనాల కాంట్రాక్టర్ల చేతివాటం…ఇందులో అధికారుల వాటా ఎంత?

రైతులను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదు

— బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ ఛైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 09 మే 2026: ధాన్యం రవాణా టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందని, ప్రభుత్వం వెంటనే దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణం లోని ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రారంభమై 15 రోజులైనా ధాన్యం కొనడం లేదని రైతులు రోడ్డెక్కుతుంటే.. అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రతి గింజ కొంటాం అని చెబుతుంటే… ప్రతి పక్షం ధాన్యం కొనుగోలు చేయడం లేదని అంటోందన్నారు. వీటన్నింటి మధ్యన ధాన్యం రవాణా చేసే వాహనాల టెండర్లలో భారీ స్కాం జరిగినా ఎవరూ పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఏటా ధాన్యం రవాణా చేయడానికి వాహనాలకు టెండర్లు నిర్వహించిన మాదిరిగానే ఈసారి కూడా జిల్లా వ్యాప్తంగా 9 సెక్టార్లు ఏర్పాటు చేసి. టెండర్లు నిర్వహించి ఒక్కో సెక్టారులో 14 – 16 టైర్లు గల 40 లారీలను అంటే మొత్తం 360 లారీలను ఎంపిక చేశారు. ఇదంతా అధికారులను నమ్మించడానికి కాంట్రాక్టర్లు పేపర్లలో మాత్రమే చూపించి అక్రమంగా టెండర్లు దక్కించుకున్నారని ఆరోపించారు. కాని ఫీల్డులో వారు చూపించిన ఒక్క లారీ కూడా తిరగకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా చెప్పవచన్నారు. వాటికి జీపీఎస్ సిస్టం అమర్చి మార్కెట్లో తిప్పాలి.. కాని టెండర్లలో చూపించిన వాహనాలు లేకపోవడంతో నేడు ఎక్కడి ధాన్యం అక్కడే నిలిచిపోయింది. దీంతో కొనుగోలు కేంద్రాల వద్ద, కల్లాల వద్ద ఎక్కడి ధాన్యం అక్కడ నిలిచిపోయిందన్నారు. అధికారులు దీనిపైన ఎందుకు ఎంక్వయిరీ చేస్తలేరని, ఈ విషయమై లారీ అసోసియేషన్ వారిని పలకరిస్తే గత ఏడాది బిల్లులే ఇంతవరకు ఇవ్వలేదు.. ఆ కంట్రాక్టర్లు ఎవరో తమ బిల్లులు ఎప్పుడు వస్తాయో కూడా తెలియని అయోమయ పరిస్థితి నెలకొందన్నారు. జిల్లా కలెక్టరు వెంటనే లారీ కాంట్రాక్టర్లను, సివిల్ సప్లయ్, ఆర్టీఏ మరియు సంబంధిత అధికారులతో మాట్లాడి టెండర్లలో ఏవైతే వాహనాలు చూపించారో ఆ వాహనాలు తిరిగే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వివి గౌడ్, జిల్లా కార్యదర్శి బత్తుల జితేందర్, నాయకులు రమేష్, యశ్వంత్, మ్యాదరి రాజు తదితరులు పాల్గొన్నారు.