POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 10 May 2026, 1:33 pm Posted by : POLITICAL POWER

*మోడీ గో బ్యాక్..!*

 

 *షాద్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ “వీర్లపల్లి శంకర్”*

 

 *జన గణనలో కులగనన జరగాలనీ డిమాండ్*

 

 *బీసీ బిడ్డ ప్రధాని అంటూ బీసీలకే అన్యాయం*

 

 *షాద్ నగర్ లో నల్ల బ్యాడ్జీలు, జెండాలతో తీవ్ర నిరసన*

 

 *”మోడీ గో బ్యాక్” అంటూ పెద్ద ఎత్తున నినాదాలు*

 

 *షాద్ నగర్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున వాహనాల్లో హైదరాబాద్ కు తరలింపు*

 

జాతీయస్థాయిలో సమగ్ర కుల జన గణన జరగాలనీ, భారతదేశానికి బీసీ బిడ్డ ప్రధాని అని గొప్పగా చెప్పుకునే నరేంద్ర మోడీ బీసీలకే అన్యాయం చేస్తున్నాడని, గో బ్యాక్ మోడీ అంటూ షాద్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ ఘాటుగా విమర్శించారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం అన్ని మండలాల నుండి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వాహనాలలో రాజధాని హైదరాబాద్ కు కార్యకర్తలు తరలి వెళ్లారు. తెలంగాణ పర్యటనలో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ వస్తుండడంతో “మోడీ గో బ్యాక్” నినాదాన్ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పెద్ద ఎత్తున

చేశారు. నల్ల జెండాలు బ్యాడ్జీలతో మోడీ పర్యటనకు నిరసన తెలిపారు. హైదరాబాద్ లో అమరుల స్తూపం వద్ద పెద్ద ఎత్తున ప్రధాని మోడీకి నిరసన తెలియజేయబోతున్నామని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో నిర్వహించే జన గణనలో బీసీ కులాల సామాజిక, విద్య మరియు ఆర్థిక స్థాయిలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుల సర్వే దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని, దేశవ్యాప్తంగా సమగ్ర కుల జన గణన చేపట్టడానికి అది మార్గదర్శకంగా నిలుస్తుందనీ ఆయన వివరించారు.

‘జన గణనలో సమగ్రంగా కుల గణన చేపట్టి జనాభా ప్రాతిపదికన బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలి. రాజకీయ, సామాజిక ఆర్థిక సమానత్వం కోసం క్రియాశీలక పోరాటాలకు సన్నద్ధం కావాలి’ అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం జనాభా లెక్కల సందర్భంగా కుల గణన చేపట్టి అందుకనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు స్థానిక సంస్థల్లో సీట్లు కేటాయిస్తూ అసెంబ్లీలో రెండు బిల్లులు ఆమోదించిందనీ అదేవిధంగా దేశవ్యాప్తంగా చేపట్టి, కులాల ప్రాతిపదికన బీసీలకు సీట్లు కేటాయించాలనీ ప్రధానంగా సూచించారు. ఆ ప్రాతిపదికన చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలనీ, ఆధునిక బానిసత్వం, ఓట్లు, సీట్లు పొందుతున్న రాజకీయ పార్టీలేవీ బీసీల అభివృద్ధి గురించి మాట్లాడవనీ అన్ని రాజకీయ పార్టీలతో జన గణనలో, కుల గణన జరిపించాలని తీర్మానం చేయించి అందుకు కావలసిన కార్యాచరణ తీసుకొచ్చేలా ఆయా రాజకీయ పార్టీల బీసీ నేతలు ఒత్తిడి తీసుకురావాలి’ అని విజ్ఞప్తి చేశారు. భారతీయ జనతా పార్టీ నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వకుండా జనగణనలో కులగనన జరగాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన ప్రధాన బాధ్యత వారిపై ఉందని వీర్లపల్లి శంకర్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఫరూక్ నగర్, కొత్తూరు, కొందుర్గు, చౌదరిగుడా, కేశంపేట, నందిగామ, షాద్ నగర్ టౌన్ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు విభాగాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..