POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 10 May 2026, 3:00 pm Posted by : POLITICAL POWER

*ఎలక్ట్రిక్ స్కూటీపై నుండి పడి యువకుడు మృతి*

 

పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక PN9 టీవీ

తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

 

మే 10

లక్షెట్టిపేట బస్టాండ్ సమీపంలో ఈరోజు ఉదయం ఎలక్ట్రిక్ స్కూటీ పై నుండి పడి లక్షెట్టిపేట బాబురావు వాడకు చెందిన జగటాల కమల్ అనే 39 సంవత్సరాల యువకుడు మృతి చెందాడు. మృతుడు రోజు మాదిరిగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వాకింగ్ కి వెళ్లి తిరిగి తన ఎలక్ట్రిక్ స్కూటీపై ఇంటికి వస్తుండగా ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోవడంతో తలకు గాయాలు కాగా స్థానికులు చికిత్స నిమిత్తం లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మంచిరాల తరిస్తుండగా మార్గమధ్యలో ఇటిక్యాల వద్ద అంబులెన్స్ లో ఎంత పిలిచిన పలకకపోవడంతో అంబులెన్స్ ను తిరిగి లక్షెట్టిపేట ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చి వైద్యులు కమల్ను పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతునికి తల్లి మరియు భార్య తోపాటు ఇద్దరు చిన్నపిల్లల సంతానం కలరు. మృతుని భార్య అర్చన ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ అన్వర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరుగుతుంది.