నారాయణ పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
అనపర్తి ఎస్సై వినయ్ ప్రతాప్, ఏజీఎం అలీషా ముఖ్య అతిథులుగా హాజరు అనపర్తి నారాయణ ఈ-టెక్నో ఆంగ్ల మాధ్యమిక పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జీఎం విజయభాస్కర్ రెడ్డి అధ్యక్షతన, ప్రిన్సిపాల్ నందకుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనపర్తి ఎస్సై వినయ్ ప్రతాప్, ఏజీఎం అలీషా హాజరయ్యారు. ముఖ్య అతిథులు జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు....