*_ఏంటి విజయ్ ఈ స్పీడ్.. తమిళనాడు సీఎంగా డ్యూటీ ఎక్కిన కొన్ని గంటలకే.._* _చెన్నై: తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన గంటల వ్యవధిలోనే జోసెఫ్ విజయ్ ప్రభుత్వ యంత్రాంగంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. సమర్థులైన ఐఏఎస్ అధికారులను తన పక్కన పెట్టుకోవాలని సీఎం విజయ్ నిర్ణయించుకున్నారు._ _తమిళనాడు ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి, ఐఏఎస్ డా. పి. సెంథిల్‌కుమార్ను ముఖ్యమంత్రికి అదనపు ప్రధాన కార్యదర్శి, కార్యదర్శి-I గా బదిలీ చేశారు. ఒక్కమాటలో చెప్పాలంంటే.. ఐఏఎస్ సెంథిల్ కుమార్ను...