మిషన్ భగీరథ నీటి సరఫరాపై సర్పంచ్ పర్యవేక్షణ పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 10 2026: పెద్దమందడి మండలం మణిగిళ్ల గ్రామంలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ తాగునీరు సక్రమంగా అందుతున్నదా లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం రోజు ఉదయం మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని 10, 11 వార్డులను సందర్శించి నీటి సరఫరా పరిస్థితిని పరిశీలించారు. ఇళ్ల...