POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 12 May 2026, 8:19 am Posted by : POLITICAL POWER

కస్తూర్బా గాంధీ పాఠశాలలో వేసవి శిక్షణా తరగతుల శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 11 2026: పెబ్బేరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో సోమవారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి రేషన్ శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ శిక్షణ శిబిరంలో క్రీడలు, నృత్యాలు, ఆంగ్లము గణితము, చిత్రలేఖనం, కరాటే లాంటి వాటిపై శిక్షణ ఇస్తారని విద్యార్థులు శ్రద్ధసక్తులతో నేర్చుకోవాలని ఎమ్మెల్యే విద్యార్థులకు సూచించారు. వేసవి సెలవులు కొనసాగుతున్నందున వనపర్తి జిల్లా పరిధిలోని 15 కస్తూర్బా గాంధీ పాఠశాలల నుంచి, రోజుకు ఒక పాఠశాలకు చెందిన అధ్యాపకులు ఇక్కడ విధులు నిర్వహిస్తుంటారని విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులకు లోను కాకుండా శిక్షణ పొందవచ్చునని ఎమ్మెల్యే తెలిపారు. విద్యార్థులు ఉన్నత విద్యాను అభ్యసించి ప్రభుత్వపరమైన ప్రతి శాఖలో ఉద్యోగస్తులుగా స్థిరపడాలని ఒక గోల్తో విద్యార్థులు ముందుకు సాగాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో జీసీడీఓ ఇందిరా దేవి, పాఠశాల ప్రత్యేక అధికారిని, వనపర్తి కస్తూర్బా గాంధీ పాఠశాల అధ్యాపకులు, పెబ్బేరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.