కళాశాల లో కొత్తగా ఏఈడీపీ కోర్స్ లను ప్రారంభించటం ఆనందదాయకం
-ఎమ్మెల్యే మేఘారెడ్డి
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 12 2026: ప్రజా పాలనా – ప్రగతి ప్రణాళిక విద్యా వారాత్సవాల లో భాగంగా సోమవారం వనపర్తి మహిళా డిగ్రీ కళాశాలలో నియోజకవర్గ శాసన సభ్యులు తుడి మేఘారెడ్డిగారు కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… కళాశాల లో కొత్తగా ఏఈడీపీ కోర్స్ ల ను ప్రారంభించటం ఆనందదాయకమని, విద్యార్థులకు స్థాయిపండ్ బాగా ఉపయోగ పడుతుంది అని అన్నారు. ఇంటర్ పూర్తి అయిన విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో అధిక సంఖ్య లో చేరి కళాశాలలో ఉండే వనరుల ను సద్వినియోగం చేసుకోవాలి అని సూచించారు. అదేవిదంగా కళాశాల సిబ్బంది విద్యార్థుల అడ్మిషన్ సంఖ్యను వచ్చే విద్యా సంవత్సరం లో మరింత పెంచుటకు సమిష్టిగా కృషి చేయాలి అని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. బి. ఈశ్వరయ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్ లు రామరాజు యాదవ్, దామోదర్ రెడ్డి, విష్ణుమూర్తి, శ్రీనివాసులు, యువరూప లక్ష్మి, గోవర్ధన్, విజయలక్ష్మి, మన్నేమన్నా, మణిదీప, సీనియర్ అసిస్టెంట్ వెంకటయ్య, బోధనేతర సిబ్బంది, విద్యార్ధినులు పాల్గొన్నారు.