POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 13 May 2026, 8:36 pm Posted by : POLITICAL POWER

విద్యుత్ శాఖలో సహా వివిధ శాఖలో ఖాళీగా ఉన్న ఏఈ పోస్టులను రెగ్యులర్ పద్ధతిలో వెంటనే భర్తీ చేయాలి.

. రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచి నిరుద్యోగులకు ద్రోహం చెయ్యొద్దు.

. డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని.

 

బద్వేల్ పొలిటికల్ పవర్ 9టీవీ తెలుగు ఎం వెంకటేశ్వర్లు కడప జిల్లా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖతో సహా వివిధ శాఖలో ఖాళీగా ఉన్న ఏ ఈ పోస్టులలో రెగ్యులర్ పద్ధతిలో వెంటనే భర్తీ చేయాలని అలాగే రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలు పెంచి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడి వారికి ద్రోహం చేయొద్దని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు చిన్ని తెలిపారు బుధవారం డివైఎఫ్ఐ బద్వేల్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే మస్తాన్ షరీఫ్ ఎస్ కే ఆదిల్ లతో కలిసి సమావేశం నిర్వహించడం జరిగింది.

 ఈ సందర్భంగా డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని మాట్లాడుతూ…… రాష్ట్రంలో లక్షలాది మంది యువత ఇంజనీరింగ్ కోర్సులు చేసి కోచింగ్ లు తీసుకొని ఏఈ ఏఈ ఈ ఉద్యోగాల కోసం అనేక సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు అన్నారు పోస్టులు రెగ్యులర్ పద్ధతిలో భర్తీ చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని పదవి విరమణ వయసు విద్యుత్ శాఖలో 62 సంవత్సరాలకు పెంచొద్దని డివైఎఫ్ఐ గా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు ముఖ్యంగా విద్యుత్ శాఖలో గత ఐదేళ్ల నుండి ఏ ఈ ఏఈఈ పోస్టులు భర్తీ చేయకుండా నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు విద్యుత్ శాఖలో 1500 కు పైగా ఏఈ ఏఈ ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు ప్రస్తుతం ఏపీ ట్రాన్స్కో 285 ఏపీ జెన్కోలో 975 ఏపీ ఈ పి డి సి ఎల్ 75 ఏపీ ఎస్పీడీసీఎల్ ను 12 75 ఏపీ సిపిడిసిఎల్ 542 మొత్తం ఒక విద్యుత్ శాఖ లోని 37 82 మంది ఉద్యోగులు రిటైర్మెంట్ అవుతున్నారని పదవి విరమణ వయసు 62 సంవత్సరాలు పెంచితే మరో రెండేళ్లు వీరు కొనసాగుతారని దీనివల్ల నిరుద్యోగులు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ షెడ్యూల్లో ప్రకారం సెప్టెంబర్ లో వస్తున్న నోటిఫికేషన్ లను విద్యుత్ శాఖలో 1500 ఏఈ ఏఈ ఈ పోస్టులు రెగ్యులర్ పద్ధతిలో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు రోడ్లు మరియు భవనాల శాఖకు సంబంధించి ఇంజనీరింగ్ పోస్టులు 600 పైగా ఖాళీలు ఉంటే జాబ్ క్యాలెండర్ మాత్రం కేవలం 132 ఇంజనీరింగ్ పోస్టులు చూపించారని పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ శాఖకు సంబంధించి 1000 కి పైగా పోస్టులు ఖాళీలు 328 పోస్టులు మాత్రమే చూపించాలని అన్నారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకు సంబంధించి 550 ఖాళీలు ఉంటే జాబ్ క్యాలెండర్లో 21 మాత్రం చూపించారని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి భయపడి వయసు పెంచుకుంటూ పోతే నిరుద్యోగులు పరిస్థితి ఏమిటి అని వారు ప్రశ్నించారు ప్రస్తుతం విద్యుత్ శాఖలో 34 582 మంది శాశ్వత ఉద్యోగులు ఉన్నారని వారిలో వచ్చే నాలుగు సంవత్సరాలు 80 శాతం మంది రిటైర్డ్ అవుతున్నారని దీని దృష్టిలో పెట్టుకొని ఏఈ ఏ ఈ ఈ పోస్టులు రెగ్యులర్ పద్ధతిలో భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు ప్రతి ఏటా ఇంజనీరింగ్ డిప్లమో కోర్సులు పూర్తిచేసి లక్షలాదిమంది యువత చదువుకొని బయటికి వస్తూ ఉంటే నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు రోడ్లపై తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దక్షిణమే ఏ ఈ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి రెగ్యులర్ పరిధిలో భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నామని లేని పక్షంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడుతామని వారు హెచ్చరించారు