**తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర స్థాయి సదస్సు హైదరాబాదులో మే 16వ తేదీ
*తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ నరాల సత్యనారాయణ*
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్
తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఆధ్వర్యంలో ఈనెల 16వ తేదీన తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్రస్థాయి సదస్సును హైదరాబాద్ లోని సురవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియం బషీర్బాగ్ లో నిర్వహిస్తున్నాము
తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సాధనకై తెలంగాణ ఉద్యమకారుల వేదిక సువర్ణ అక్షరాలతో తెలంగాణ చరిత్రలో లిఖించే విధంగా తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నది. కావున తెలంగాణ 33 జిల్లాల్లోని ఉద్యమకారులందరూ కూడా హాజరు కాగలరని మనసా వాచా కర్మణా కోరుకుంటున్నాను
తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సాధనకై సురవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియంలో ఈనెల 16న నిర్వహించే ఉద్యమకారుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయవలసిందిగా తెలంగాణ 33 జిల్లాలలోని తెలంగాణ ఉద్యమకారులకు తెలియజేస్తున్నాం
తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్స్ ను ఎట్టి పరిస్థితులలో నెరవేర్చే దిశగా పకడ్బందీ ప్రణాళికతో ప్రభుత్వము దిగి వచ్చే విధంగా ఒక రూపకల్పన చేయడం జరిగింది. కావున తెలంగాణ 33 జిల్లాల నుండి ఉద్యమకారులు హాజరు కావలసిందిగా కోరుచున్నాము