మాట్లాడుకోవాలి ఇలాంటి విషయాలు..
సిగ్గుపడి డిస్కస్ చేయకుండా ఉండే విషయాలు కాదు ఇవి..
ఇంట్లో ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్కరు ఆడ మగ కూడా అవగాహన కలిగి ఉండాలి.

పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక PN9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
ఆడవారికి ప్రతి నెల సహజంగా వచ్చే ఋతు క్రమాన్ని శుభకార్యాలు ఉన్నాయనో దైవ దర్శనాలకు అడ్డు అనో కొద్దీ రోజులు ఆపే ప్రయత్నం అసలు మంచిది కాదు.
లైఫ్ టైం మొత్తంలో ఒక్కసారి అత్యవసర సందర్భం అయితే అపుడు కూడా గైనకోలజిస్ట్ సూచన మేరకు మాత్రమే ఈ పిల్స్ వాడాలి తప్ప తరచుగా వేసుకోకూడదు.మాకు బానే ఉంది ఎలాంటి సమస్యలు లేవంటారేమో కొందరు ఆడ శిఖామణిలు.ఉండవు ! ఇంకెపుడో దాని ప్రభావం తీవ్ర రూపం దాల్చుతుంది. సహజంగా జరిగె ప్రక్రియను ఆపేయడం తో హార్మోన్ల అసమానత జరుగుతుంది మరియు ఈ పిల్స్ కొందరిలో రక్తం చిక్కపడేలా చేస్తుందని డాక్టర్స్ అంటున్నారు. అందుకే ఈ అమ్మాయి చనిపోయింది.