POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 14 May 2026, 6:19 pm Posted by : POLITICAL POWER

*రైతులు ఇబ్బంది పడకుండా చూడాలి*

*మంచిర్యాల డిసిపి భాస్కర్*

మే 14

పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక PN9 టీవీ

వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని మంచిర్యాల డిసిపి ఎగ్గిడి భాస్కర్ మిల్లర్లను సూచించారు. లక్షట్ పేట మండలంలోని పలు గ్రామాల్లో రైస్ మిల్లులను డిసిపి గారు మంచిర్యాల ఎసిపి ప్రకాష్ గారి తో కలిసి సందర్శించారు. లక్షట్ పేట తాసిల్దార్ తో కొనుగోలు కేంద్రాల ప్రక్రియ కొనుగోలు చేసిన ధాన్యం నిలువచేసే గోదాముల వివరాలు రైస్ మిల్లుల యజమానులతో మాట్లాడుతూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల నుండి వచ్చిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా వెంట వెంటనే మిల్లరు దింపుకోవాలని ఆదేశించారు. కేంద్రాల్లో దాన్యం ఉండకుండా అధికారులు సైతం ధాన్యాన్ని లారీల్లో గాని ట్రాక్టర్లలో గాని రైస్ మిల్ కు గోదాములకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరం మేరకు గన్ని బ్యాగ్స్ టార్పాలిన్లు కూడా అందుబాటులో ఉంచుకోవాలని కేంద్రం నిర్వాహకులకు అధికారులు తెలుపారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసిల్దార్ దిలీప్ కుమార్ ఎస్సై సురేష్ తోపాటు మిల్లర్లు కేంద్రం నిర్వాహకులు ఉన్నారు.