POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 15 May 2026, 6:05 pm Posted by : POLITICAL POWER

ఖమ్మం కార్పొరేషన్ పై పర్యవేక్షణ కరవు.

మే 15

శానిటేషన్ గాలికి వదిలేసారు.

-పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ఎన్ టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం నుంచి ఎడిటర్ డెస్క్

లక్షలాది రూపాయలతో కొనుగోలు చేసిన. *”స్వీపింగ్”* మిషన్ గత కొన్ని నెలలుగా నడిరోడ్డు మీద వదిలేశారు.

డివిజన్ లలో పడకేసిన *పారిశుధ్యం*.

అమాత్యులు దృష్టి సారించి

వెంటనే చర్యలు చేపట్టాలి.

*షేక్ బాజీ బాబా*

(జిల్లా అధ్యక్షుడు)

ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఐ యు ఎం ఎల్ పార్టీ ఖమ్మం జిల్లా.

 

 

ఖమ్మం కార్పొరేషన్ పై పర్యవేక్షణ కోరవడిందని, శానిటేషన్ వ్యవస్థను పూర్తిగా గాలికి వదిలేసారని, పట్టించుకునే నాధుడే లేరని, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఐ యు ఎం ఎల్ పార్టీ జిల్లా అధ్యక్షుడు *షేక్ బాజీ బాబా* ఆరోపించారు.

అధికారుల నిర్లక్ష్యం వల్ల అన్ని డివిజన్ లలో పారిశుద్ధ్యం పడక వేసిందని, కార్పొరేషన్ లో ఉన్న వాహనాలు కూడా మరమ్మత్తుల్లో ఉన్నాయని, దీని ద్వారా ఖమ్మం పట్టణంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల

ఎక్కడికక్కడ పారిశుద్ధ లోపం స్పష్టంగా కనబడుతుందని ఆయన అన్నారు.

కార్మికుల శ్రమలు తగ్గించేందుకు పట్టణంలోని రోడ్లు శుభ్రంగా ఉంచే దిశగా లక్షలాది రూపాయలు పోసి కార్పొరేషన్ అధికారులు ఆధునిక నైపుణ్యం కలిగిన స్వీపింగ్ వాహనాలను కొనుగోలు చేసినప్పటికీ, నిర్లక్ష్యంతో ఎక్కడికక్కడ వదిలేయడంతో అవి రోడ్లమీద అలాగే దర్శనమిస్తున్నాయి.

కనీసం వాటిని మరమత్తులు చేయించి, నడిపించాల్సిన అధికారులు నిర్లక్ష్యంతో వ్యవహరించడం వల్ల బైపాస్ రోడ్ లో స్వీపింగ్ వాహనము అలాగే ఉంది. కావున *మంత్రి తుమ్మల, కమిషనర్* ప్రత్యేకమైన చర్యలు తీసుకొని ఒక ప్రత్యేక సమావేశాన్ని అధికారులతో ఏర్పాటు చేసి వెంటనే డివిజన్ లలో పారిశుద్ధ్య లోపాలను సరి చేసి కార్పొరేషన్ అభివృద్ధి కోసం కృషి చేయాలని ఆయన అన్నారు.