POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 15 May 2026, 7:49 pm Posted by : POLITICAL POWER

చందారం గ్రామం గర్వపడేలా 578 మార్పులు సాధించిన మనోజిని కి

గ్రామ సర్పంచ్ ఇస్లావత్ కళ ఉత్తం, ఘన సన్మానం

మే 15

మంచిర్యాల జిల్లా లక్షట్ పేట్ మండలం చందారం గ్రామనికి చెందిన మనోజిని ప్రభుత్వ పాఠశాలలో చదివి పేరు తెచ్చిన సందర్భంగా గ్రామ వాసులు గణ సన్మానం చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ ఇంత చిన్న వయసులోనే చిన్నారి గ్రామ ప్రజలు యువత శుభాకాంక్షలు తెలిపారు.

ప్రతిభకు ప్రైవేట్ బడినే కొలమానం అని భావించే విద్యార్థులకు,వారి తల్లిదండ్రులకు ఈ ఫలితం ఒక గుణపాఠం.చదువే సత్తా ఉండి,పట్టుదలతో ఉంటే ఏ బడి లో అయినా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు అని చూపెట్టడానికి ఇదొక నిదర్శనం.ఇంటి నిర్మాణానికి పునాది ఎంత బలంగా ఉండాలో భవిష్యత్ విద్యకు 10 వ తరగతి అనేది కూడా అంతే బలంగా ఉండాలి.భవిష్యత్తు కు తొలి మెట్టుగా భావించి 10 వ తరగతి ను బ్రహ్మాండమైన ఫలితం తో పూర్తి చేసి,కళాశాల విద్య వైపు పడుతున్న అడుగులు అంతరాయం లేకుండా అద్భుతంగా ముందుకు సాగుతూ,మరింత పేరు తేవాలని భవిష్యత్తు లో మరింత ఉన్నత లక్ష్యం వైపు వెళ్లాలని గ్రామ సర్పంచ్ ప్రజలు కోరుకున్నారు.