POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 15 May 2026, 9:53 pm Posted by : POLITICAL POWER

ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని యువకుడి ఆత్మహత్య

నాలుగేళ్ల క్రితం ఇంట్లో తెలియకుండానే పెళ్లి చేసుకున్న ప్రేమ జంట

వీరికి పుట్టిన బిడ్డను అమ్మేసి ఇంకొకరితో పెళ్లికి సిద్ధమైన యువతి

పెళ్లి పనులు కూడా తనతోనే చేయించుకోవడంతో తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు

 

హైదరాబాద్ – హయత్‌నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొహెడ గ్రామంలో నివాసముండే పల్లపు గోవర్ధన్ అనే యువకుడిని నాలుగేళ్లుగా ప్రేమించి ఇంట్లో తెలియకుండా వివాహం చేసుకున్న సరిత అనే యువతి వీరిద్దరికి ఒక బిడ్డ పుట్టగా, ఇటీవల ఆ బిడ్డను అమ్మేసి ఇంకొకరిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అయిన సరిత ఈ విషయం తెలిసి ఎన్ని సార్లు బతిమాలినా తనతో వచ్చేందుకు సరిత నిరాకరించడంతో, తీవ్ర మనస్తాపానికి గురైన గోవర్ధన్ మంగళవారం నైట్ డ్యూటీ ముగించుకుని మరుసటి రోజు ఉదయం 10:30 గంటలకు ఇంటికి వచ్చి, సాయంత్రమైనా బయటికి రాకపోవడంతో, తలుపులు పగలగొట్టి చూసిన గోవర్ధన్ సోదరి తలుపులు తెరిచి చూసేసరికి ఉరి వేసుకుని విగతజీవిగా దర్శనమిచ్చిన గోవర్ధన్ తన ఆత్మహత్యకు కారణమైన యువతిని వదిలిపెట్టొద్దు అంటూ ఫోన్లో వీడియో రికార్డ్ చేసిన యువకుడు గోవర్ధన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు  అమ్మేసిన బిడ్డ ఆచూకీ ఇప్పటివరకు తెలియలేదని పోలీసుల ప్రకటన