POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 17 May 2026, 6:57 pm Posted by : POLITICAL POWER

*మోడీ సభ గ్రాండ్ సక్సెస్..

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పి యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి భారీ బహిరంగ సభ తెలంగాణ రాజకీయ చరిత్రలో ఒక మహాసభగా నిలిచిపోయింది.

లక్షలాది మంది ప్రజలు, కార్యకర్తలు స్వచ్చందంగా తరలి వచ్చారు . ఇతర పార్టీల లెక్క

ఒక బీరు లేదు..ఒక బిర్యానీ లేదు..మీటింగ్‌కి రావడానికి 500 రూపాయల కూలీలేదు..

లక్షలాది మంది ప్రజలు, కార్యకర్తలు, సాధుసంతులు, యువకులు, మహిళలు…

అందరూ స్వచ్ఛందంగా, సొంత ఖర్చులతో, ఆత్మగౌరవంతో కదం తొక్కారు.ఇది భారతీయ జనతా పార్టీపై ప్రజల విశ్వాసం ఇది తెలంగాణలో మార్పు కావాలన్న తపన..ఇది హిందూ సంస్కృతి సంప్రదాయాలపై గౌరవం..ఇది వికాసం మీద ఆశ.హైదరాబాద్ మొత్తం.

  • మోడీ.. మోడీ. నినాదాలతో మారుమోగింది..

మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 7. గంటల వరకు…

అంటే, ఒక్కరు కూడా కుర్చీ నుంచి లేవకుండా క్రమశిక్షణతో,నినాదాలు ఇస్తూ ప్రధాని ప్రసంగం పూర్తయ్యే వరకు ఉన్నారు..ఇది ఒక సంకల్ప సభ స్వాభిమాన సభ భవిష్యత్‌ను నిర్మించే సభ.కార్యకర్తల నుండి జిల్లా, రాష్ట్ర నాయకులంతా శ్రమించి సహకరించారు.ఈ సభను విజయవంతంగా నిర్వహించడంలో మన ప్రియతమ నాయకుడు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచందర్ రావు.వందకు వంద శాతం విజయం సాధించారు..ఇది తెలంగాణలో బీజేపీ అధికార దిశగా అడుగుపెట్టిన స్పష్టమైన సంకేతం! 2028… బిజెపి సర్కార్ ఖాయం..

*కపిలవాయి రవీందర్.*