క్రిప్టో పేరుతో రూ.13 కోట్లు మోసపోయిన వైద్యుడు

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పి యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో కే సతీష్ కుమార్
పెట్టుబడి పెట్టించి..నట్టేట ముంచిన సైబర్ నేరగాళ్లు.గుంటూరులోని ప్రముఖ ప్రైవేటు వైద్యుడు క్రిప్టోకరెన్సీ పేరుతో పెట్టుబడులు పెట్టి రూ.13 కోట్లు మోసపోయారు*. దీనిపై పోలీసు లకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.వైద్యుడు తనతోపాటు మరికొందరు స్నేహితుల సొమ్ము కూడా ఇందులో పెట్టుబడిగా పెట్టినట్లు తెలిసింది. క్రిప్టోకరెన్సీ పేరుతో ఆన్లైన్లో అధిక లాభాలు ఆశ చూపగా.. వైద్యుడు భారీగా పెట్టుబడి పెట్టారు.తొలుత లాభాలు చూపించి, మరింత సొమ్ము పెట్టేలా నమ్మకం కలిగించడంతో బాధితుడు ఈ మొత్తం పెట్టారు. చివరికి ఆన్లైన్ ఖాతాలో డబ్బులు కనిపిస్తున్నా.. వాటిని తీసుకోలేక పోతున్నారు. దీంతో మోసపోయినట్లు గ్రహించారు*.