జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.
జర్నలిస్టులు నిజనిర్ధారణ వార్తలనే నివేదించాలి.
త్వరలోనే జర్నలిస్టుల ఇంటి స్థలాలపై సీఎం ప్రకటన.
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి.

మే 17:
పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు PN9, టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు.
హనుమకొండ లోని ఆదర్శ లా కాలేజీలో ఆదివారం జర్నలిస్టుల సంక్షేమ సంఘం(జే ఎస్ ఎస్. రిజిస్టర్ నెంబర్ 914/2015) రాష్ట్ర ప్రధమ సదస్సు రాష్ట్ర అధ్యక్షులు తక్కెళ్ళపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ..
జర్నలిస్టులు వార్తలు రాసేముందు క్షేత్రస్థాయిలో పరిస్థితులను నిర్ధారణ చేసుకొని వార్తలను నివేదించాలి అని సూచించారు. హనుమకొండలో జర్నలిస్టుల విషయంపై ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలిపారు. హైదరాబాదులో జర్నలిస్టుల ఇంటి స్థలాల విషయంలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే చర్చించారని వివరించారు. జర్నలిస్టుల ఇంటి స్థలాల విషయంలో త్వరలోనే ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని చెప్పారు.
విలేకరులు సమాచార లోపంతో హైలెట్ చేయాలనే ఉద్దేశంతో రాజకీయ నాయకుని పై, అధికారిపై వార్తలు రాయడం వల్ల ఎదుటివారి క్యారెక్టర్లు దెబ్బ తినడంతో పాటు మనోభావాలు కూడా దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులు వాస్తవాలను సేకరించి వార్తలు రాయడం వల్ల విలేకరులకు మంచి పేరు వస్తుందని, దానివల్ల సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని అన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో గాని, రాష్ట్రవ్యాప్తంగా గాని జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లడంలోను.. సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయడంలో తన వంతు పాత్ర ఉంటుందని అన్నారు. హనుమకొండలో జర్నలిస్టులకు అండదండగా ఉంటానని హామీ ఇచ్చారు.
జాతీయ అధ్యక్షులు మానసాని కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. సంఘం ద్వారా వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నిజమైన జర్నలిస్టుకు అక్రిడేషన్ అవసరం లేదని, సంస్థ జారీ చేసే గుర్తింపు కార్డు ఉంటే చాలని తెలిపారు. సంఘాన్ని బలోపేతం చేయడానికి రాష్ట్ర, జిల్లా నాయకత్వం కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్షులు తక్కెళ్ళపల్లి శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కానుగంటి రాజు మాట్లాడారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బందెల రాజశేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు నూటంకి ప్రభాకర్, రాష్ట్ర మహిళా కార్యదర్శి చాగంటి మంజుల, రాష్ట్ర కార్యదర్శి సూరపాక రాజు, జర్నలిస్టుల సంక్షేమ సంఘం తరఫున లీగల్ అడ్వైజర్ రాచకొండ ప్రవీణ్ కుమార్, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎండి ఆదిల్, పోశాల బిక్షపతి గౌడ్, హనుమకొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కాసుల శ్రీనివాస్, వడ్లకొండ అనిల్ గౌడ్, ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు నరేష్, కిరణ్, సురాసిరాజు , బండారి రాజు, బాలాజీ నాయక్ అధిక సంఖ్యలో సంఘ సభ్యులు పాల్గొన్నారు.