పశువుల సంతలు తాత్కాలికంగా మూసివేత
జిల్లా కలెక్టర్ హరిత

మే 17
పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక PN9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో
అసిఫాబాద్ జిల్లా; జంతు సంక్షేమ చట్టాల అమలులో భాగంగా ఆసిఫాబాద్ జిల్లాలోని వారాంత పశువుల సంతలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హరిత తెలిపారు. జిల్లాలో అక్రమ పశు రవాణా పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు జిల్లా వ్యాప్తంగా ఎలాంటి పశువుల సంతలు నిర్వహించరాదని అధికారులను ఆదేశించారు.