POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 18 May 2026, 9:17 pm Posted by : POLITICAL POWER

ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్‌గా పదోన్నతి పొందిన శ్రీమతి బెల్లం రాధిక కి ఘన అభినందనలు.

 

 

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో హార్టికల్చర్ అధికారిణిగా విశిష్ట సేవలు అందిస్తూ నగర సుందరీకరణ, పచ్చదనం అభివృద్ధికి విశేష కృషి చేసిన శ్రీమతి బెల్లం రాధిక ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ ( ఎఫ్ డి ఓ )గా పదోన్నతి పొందిన సందర్భంగా.

హాస్టల్ వెల్ఫేర్ ఫోరం జిల్లా అధ్యక్షులు కోటపాటి రుక్మారావు ఆధ్వర్యంలో ఈరోజు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని వారి చాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిసి.

శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ఈ సందర్భంగా వారి దంపతులకు పూల మొక్కను మరియు జ్ఞాపికను అందజేసి అభినందనలు తెలిపారు.

అనంతరం పదోన్నతి పొందిన సందర్భంగా ఖమ్మం మునిసిపల్ ఫ్రీడమ్ పార్క్‌లో రాధిక.

చేతుల మీదుగా మొక్కను నాటించి పర్యావరణ పరిరక్షణకు సంకేతంగా.

కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా రుక్మారావు మాట్లాడుతూ,

బెల్లం రాధిక మున్సిపల్ హార్టికల్చర్ అధికారిణిగా ఖమ్మం నగరాన్ని మరింత అందంగా తీర్చిదిద్దడంలో,

పార్కుల అభివృద్ధి, పచ్చదనం పెంపొందింపులో విశేష కృషి చేశారని,

నగర సుందరీకరణలో ఆమె చేసిన సేవలకు ప్రజల నుంచి.

అధికార వర్గాల నుంచి ప్రశంసలు అందుకున్నారని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఆమె తన విధుల్లో మరింత ఉన్నత స్థాయికి చేరుకుని ప్రజలకు. సేవలందించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో హాస్టల్ వెల్ఫేర్ ఫోరం ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ ఎస్. వెంకట్ రెడ్డి, వసతి గృహ సంక్షేమ అధికారులు కే.నరేందర్, యన్.రమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.