కేజ్రీవాల్,జగన్ ,విజయ్ వీరోచిత విజయాల వెనుక

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్
ఆయా సమయాల్లో
ఎన్ని వత్తిళ్లు బెదిరింపులు వచ్చినా ..
అదరక బెదరక అధికార ప్రతిపక్షాలను
ఒకే రీతిలో ఎండకట్టడం తో
ప్రత్యామ్నాయంగా ప్రజలు పట్టం కట్టారు వీళ్ళను
(2009 లో
లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ పార్టీ పెట్టినా
ఎన్నికల్లో బాబు పట్ల కొంచెం సాఫ్ట్ గ ఉండడం తో
లోక్ సత్తాకు ఓటు వేసినా టీడీపీ కి ఓటు వేసినట్టే
అని భావించారు ప్రజలు
అందుకే సెటిలర్స్ ఎక్కువగా ఉండే
కూకట్ పల్లి లో జయప్రకాష్ నారాయణ మాత్రమే గెలిచాడు
(అది కూడా లోపాయికారీగా
టీడీపీ పోటీ చేయకుండా
టిఆర్ఎస్ కు సీటు వదిలేయడం తో )
2014 ఎన్నికలకు నెల ముందు
జనసేన పార్టీ పెట్టినప్పుడు
ఇల్లేమో దూరం,
అసలే చీకటి గాఢాంధకారం,
దారంతా గతుకులు,
చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది
లడేంగే లడేంగే
సముద్రం ఎవరి కాళ్ళ దగ్గరికి పోదు
కొండ ఎవరికీ తల వంచదు
ఈ దేశపు జెండా కున్నంత పొగరు వుంది
అని పవన్ భారీ డైలాగులు చెప్పి
నేను పోటీ చేస్తే జగన్ గెలుస్తాడు కాబట్టి
పోటీ చేయకుండా బాబుకు మద్దతు ఇస్తా అని
కాపు కాస్తే సీఎం ఎలా అవుతాడు
ఒక సినీ హీరోకు మొదటి సారి
పార్టీ పెట్టినప్పుడే ఎక్కువ క్రేజ్ గ్లామర్ ఉంటుంది
దాన్ని బాబు కోసం వాడాడు
2014 లో కేంద్రం లో మోడీ
ఇక్కడ జగన్ వస్తాడు అని అని సర్వేలు చెప్పాయి
ఆ టైం లో పవన్ పార్టీ పెట్టి
టీడీపీ ని మోయకుండా ఉంటె
ఆ ఎన్నికల్లో వరుసగా 3 వ సారి టీడీపీ ఒడి
(2004 2009 లో వైయస్సార్ చేతిలో ఓడింది )
దాదాపుగా కనుమరుగయ్యేది
2019 నాటికీ
జగన్ పవన్ మధ్య పోటీ ఉండేది
విజయం వీరులను వర్తిస్తుంది
కానీ భీరువులను కాదు
నక్కజిత్తులు
అన్ని వేళలా పనిచేయవు
ఇక 2019 లో
టీడీపీ ప్రభుత్వం మీద ఉన్న
వ్యతిరేక ఓటు (ముక్యంగా కాపులు )జగన్ కు వెళ్ళకూడదు
అని పవన్ చేత విడిగా పోటీ చేయించాడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ
ఆ ఎన్నికల్లో
సీఎం బాబును వదిలి
“జగన్ సీఎం కాడు కాబోడు ఇది నా శాసనం”
అంటూ ప్రతిపక్ష జగన్ మీద విరుచుకుపడ్డాడు
దాంతో జనసేనకు ఓటు వేసినా
టీడీపీ కి ఓటు వేసినట్టే అని
కాపులు ప్రజలు భావించడం వలన
కాపులు ఎక్కువగా ఉండే భీమవరం
గాజువాకలో 2 చోట్ల పవన్ ఓడిపోయాడు
మాయావతి బి ఎస్ పి సిపిఐ సిపిఎం తో కలసి జనసేన
136 స్థానాల్లో పోటీ చేస్తే 120 చోట్ల డిపాజిట్లు రాలేదు
జనసేనకు 7 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి
కేవలం రాజోలు లో మాత్రమే గెలిచింది
నోట్ నీతి ఏంటంటే
ఎదుటివానికి ఒక కన్ను పోవాలని తపస్సు చేస్తే
మనకు ఉన్న 2 కళ్ళు పోతాయి