POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 18 May 2026, 9:47 pm Posted by : POLITICAL POWER

ఆకలేస్తోందని పిలిపించి.. అమ్మనే అతి కిరాతకంగా చంపిన 16 ఏళ్ల కొడుకు

పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక PN9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో

విజయనగరం జిల్లా రాజాంకు చెందిన ముంజేటి సతీష్, స్పందన(34) దంపతులుల‌కు 16 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఇటీవలే పదో తరగతి పూర్తి చేశాడు. పాఠశాలలో ఓ అమ్మాయికి ప్రేమలేఖ రాశాడని స్కూలు యాజమాన్యం తల్లిదండ్రులకు చెప్పింది..

 

దీంతో “మంచిగా ఉండు.. చెడు స్నేహాలు వద్దు.. బాగా చదువుకో” అని అమ్మ తరచూ చెప్పేది. దీంతో అమ్మ మీద‌నే కొపం పెంచుకున్నాడు.

 

క్రికెట్ ఆడే సమయంలో తండ్రిపై కోపంతో “ముంబైకి వెళ్లి డాన్‌లా ఎదగాలి” అనుకునే ఓ బాలుడు ఇతనికి పరిచయమయ్యాడు. దీంతో ఈ నెల 4న స్పందన పక్క వీధిలోని తన పుట్టింటికి వెళ్లింది. ఈ విషయాన్ని తన స్నేహితుడికి చెప్పడంతో అతడు కత్తితో వీళ్లింటికి వచ్చాడు.

 

బీరువాలో ఉన్న తొమ్మిదిన్నర తులాల బంగారం, రూ.5 వేలు తీసి బ్యాగులో సర్దుకోని. తనకు ఆకలిగా ఉందని అమ్మను రమ్మని తన అమ్మమ్మకు ఫోన్ చేసి పిలిపించి. తన అమ్మ వచ్చి చేతులు కడుక్కుంటుండగా కాపు కాసిన కుమారుడి స్నేహితుడు ఆమె గొంతు పట్టుకోగా.. కుమారుడు, అతని స్నేహితుడు కలిసి అతి కిరాతకంగా పొడిచి చంపేశారు. స్పందన శరీరంపై దాదాపు 16 కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

 

చనిపోయాక చీరతో చుట్టేసి సమీపంలోని కోనేరులో పడేయగా.. మృతిపై అనుమానం రావడంతో, కుమారుడు కూడా కనిపించకపోవడంతో ఆ దిశ‌గా పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

 

హత్య చేసిన నిందితులు మొదట భువనేశ్వర్‌కు వెళ్లి, అక్కడి నుంచి ముంబై, తిరుపతి, విశాఖపట్నంలో తిరిగి పలాసకు వెళ్లే క్రమంలో పోలీసులకు పట్టుబడ్డారు.