POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 19 May 2026, 6:04 pm Posted by : POLITICAL POWER

తాసిల్దార్ కార్యాలయం వద్ద త్రాగునీరు ఏర్పాటు చేయాలి.

గత సంవత్సరం నుండి ఇప్పటి వరకు త్రాగు నీరు ఏర్పాటు చేయాలని అనేక సార్లు వినతి.

పట్టించు కొని తహశీల్దార్ రాఘవేందర్ రావు

 తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం(TAGS) జిల్లా కార్యదర్శి ఎర్మ పున్నం

పొలిటికల్ పవర్ పిఎన్ 9 న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

మంచిర్యాల జిల్లా కోటపల్లి తాసిల్దార్ కార్యాలయం ఆవారన లో ప్రజలకు త్రాగునీటి సదుపాయం ఏర్పాటు చేయాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం(TAGS) ఆద్వర్యం లో తాసిల్దార్ రాఘవేంద్రరావు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి ఎర్మ పున్నం మాట్లాడుతూ వేసవి ఎండలు దంచి కొడుతున్న సందర్భం లో నిత్యం రద్దీగా ఉండే కోటపల్లి తాసిల్దార్ కార్యాలయం వద్ద కనీసం త్రాగనీరు కూడా ఏర్పాటు చేయకపోవడం తాసిల్దార్ గారి నిర్లక్ష్యమేనని అన్నారు, అవసరాల కోసం కార్యాలయానికి వచ్చిన ప్రజలకు త్రాగునీరు అందించాలని గత సంవత్సరంలో కూడా వినతి పత్రం ఇచ్చి త్రాగు నీరు ఏర్పాటు చేయాలని అనేకసార్లు గుర్తు చేసినప్పటికీ దానిని దాటవేస్తూ వచ్చారు , అందుబాటులో త్రాగునీరు లేకపోవడంతో ఇక్కడికి వచ్చిన రైతులు తన దాహాన్ని తీర్చుకోవడం కోసం కిరాణా షాపుల వద్ద నీటిని కొనుగోలు చేసి చాలీ చాలని నీటితో, డిహైడ్రేషన్ కి గురై ఇబ్బందులు పడుతున్నారు, త్రాగు నీటి కోసం బయటకు వెళదామంటే అధికారి గారు ఎప్పుడు పిలుస్తారో అని తన దాహాన్ని చంపుకొని ఎదురుచూస్తూ ఉన్నారు, ఇప్పటికైనా తాసిల్దార్ రాఘవేంద్రరావు గారు ప్రజల దాహార్తిని దృష్టిలో పెట్టుకుని వెంటనే త్రాగు నీటిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఒకవేళ ఏర్పాటు చేయని యెడల జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని స్హెచ్చరించారు ఈ కార్యక్రమం లో జిమిడే రాజమల్లు, జిమిడే లింగయ్య, కన్న సత్యన్న, పోగుల గంగన్న, దామోదర్, జిమెడి అంజన్న, పాటి మీద సంపత్, కొండ సమ్మయ్య, జిమిడే లింగయ్య, రావుల జీవన్, ముంజం పోషమల్లు, కొండగుర్ల అశోక్, లు పాల్గొన్నారు ఈ