వడదెబ్బతో మృతిచెందిన పారిశుద్ధ్య కార్మికునికి నివాళులర్పించిన గ్రామపంచాయతీ పాలకవర్గము మరియు సిబ్బంది

సర్పంచ్ నలిమెల రాజు
పొలిటికల్ పవర్ పిన్ 9 న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
మంచిర్యాల జిల్లా, లక్షట్ పేట మండలం వెంకట్రావు పేట గ్రామపంచాయతీలో గత 31 సంవత్సరాలుగా పారిశుద్ధ్య కార్మికునిగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీ తాళ్లపల్లి లచ్చయ్య గారు మూడు రోజుల క్రితం వడదెబ్బతో మృతి చెందారు ఈ సందర్భంగా వారు గ్రామపంచాయతీకి చేసిన సేవలను స్మరించుకుంటూ గ్రామ సర్పంచ్ మరియు పంచాయతీ పాలకవర్గం మరియు సిబ్బంది వారి చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పించి మౌనం పాటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారి మరణం వారి కుటుంబ సభ్యులకు తీరనిలోటని వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యం తొలగించాలని లచ్చయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని వేడుకున్నారు..
1. గ్రామపంచాయతీ నుంచి లచ్చయ్య కుటుంబానికి 10,000/- రూపాయలు..
2. సర్పంచ్ గారు వ్యక్తిగతంగా 5000/- రూపాయలు
మరియు పాలకవర్గ సభ్యులు
3. మీసా శ్రీనివాస్ గారు 2000 రూపాయలు
4. బోడ కుంటి మారుతి గారు 2000 రూపాయలు
5. దాసరి ఏసు మని గారు 1000/-
6. అంకతి వెంకటేష్ గారు 1000/-
7. బెడగం రామయ్య గారు 1000/-
8. తోట దివ్యసాగర్ గారు 1000/-
9. VRA కన్లే విజయ గారు 500/-
10. పంచాయతీ కార్యదర్శి వంశి కృష్ణ గారు 2000/-
అందించారు.